Sampradaya Veg Foods - సాంప్రదాయ శాకాహారశాల - అమ్మ చేతి ఆప్యాయ రుచులు

Sampradaya Veg Foods - సాంప్రదాయ శాకాహారశాల - అమ్మ చేతి ఆప్యాయ రుచులు

656 0 Food Delivery Service

7207896012 sampradaya.mom@gmail.com

Sri Ramakrishna Puram, Road # 1, Near : ప్రత్యంగిరా దేవాలయం., Hyderabad, India - 500035

Is this your Business ? Claim this business

Reviews

Overall Rating
0

0 Reviews

5
0%
4
0%
3
0%
2
0%
1
0%

Write Review

150 / 250 Characters left


Questions & Answers

150 / 250 Characters left


About Sampradaya Veg Foods - సాంప్రదాయ శాకాహారశాల - అమ్మ చేతి ఆప్యాయ రుచులు in Sri Ramakrishna Puram, Road # 1, Near : ప్రత్యంగిరా దేవాలయం., Hyderabad

ఈ ముఖ పుస్తక భాండాగార పరిచయ ముఖ ద్వారమున మా ముఖ పరిచయం అనివార్యం ... అందుకే మా ఆశయ లక్ష్య సంకల్ప సాక్షాత్కారం అక్షర రూపేణా ప్రత్యక్షం.

ఏనాటినుంచో అనాది కాలంగా మన దైనందిన జీవితంలో రుచికరమైన షడ్రుచుల గురించిన భాషణం లేని సంధర్భం లేదు అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం, సమయాభావం వలన ఆ రుచులు సంభాషణలలో ఇమిడిపోయి ... మిగిలిపోయి ఆహారంలో భాగం కాక ... 'హారం' అనగా దారం మాత్రమే అన్న చందాన సరిపెట్టుకోవలసిన పరిశ్థితికి చేరుకున్నాం.

మన తండ్రులు, తాతలు, అమ్మలు, అమ్మమ్మలు పూర్వకాలం తమ కుటుంబానికి స్వచ్ఛమైన ఫలహారాలు, భోజన పధార్థాలు, పిండివంటలు ఆప్యాయంగా చేసి పెట్టేవారు. వారికి ముఖ్య దినచర్య ఆహరంలోకి ముడిపధార్ధాల తయారీ మరియు వాటి నిల్వ. ఎంతో మితంగా, పొదుపుగా ... ప్రేమతో ఏ రోజుకారోజు వండుకుని తినడానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు. దాదాపు అందరిదీ వ్యవసాయాధారిత జీవనమే. పండ్లు, కూరలు మరియు వివిధ పప్పులు, ఉప్పులు, అపరాలు, సరుకులు పుష్కలంగా లభ్యమయ్యేవి ... ఫలితం ... బలవర్ధకమైన, స్వచ్ఛమైన, రుచికరమైన అహారం. ఈ రోజుల్లో అవన్నీ తలచుకుంటూ ... చేతనైనంత నోట్లో వేసుకుని ఉరుకుల పరుగుల జీవితం గడుపుతున్నాం. రుచులు తెలియడం ఒకటైతే, వాటిని మనం రుచిగా చేసుకోవడం మరొక భాగ్యం. అపుడే దానిని ఆశ్వాదించగలం. తింటున్నాం ... కాని తృప్తి లేదు. దానికి లక్ష కారణాలు. అవి అసంధర్భం.

మేము మా ఇంట ... అమ్మమ్మలు, అమ్మ, పెద్దమ్మ, పిన్నులు, అత్తల చేతి వంటల రుచులు చూసిన వారం. అదే ప్రేరణతో ... అవే రుచులు మనకే గాక చుట్టుపక్కల ఆహర ప్రియులకూ అందాలనే ఆలోచనతో, తాపత్రయంతో ... వారు తృప్తిగా ప్రశంసించే క్షణం కోసం ఈ సంకల్పం చేసాం. మీ ఇంట ఆ రుచుల వంటలు లేవని కాదు, పెద్దలు చేయలేరని కాదు ... మనకే చేసుకునే ఓపిక లేని ఈ రోజుల్లో ఆ భాగ్యం పదిమందికి పంచడం శ్రమతో కూడిన ఆశయం. ఎంత మంది దానికి కార్యరూపం ఇవ్వగలరు ?... ఆచరణ సాధ్యం చేయగలరు ? అందుకే మా ప్రయాణం ఇక్కడే మొదలయింది. దీని వెనుక వారి హస్తవాసి ప్రధమ సోపానం. సాంప్రదాయ రుచులను, సుచిగా, శుభ్రంగా, స్వచ్చంగా మీకు పలు విధాలుగా అందచేయాలని మా పరిపూర్ణ ఆకాంక్ష.

మాది పచ్చని కోనసీమ ... పల్లెటూరి బాల్యం, చదువులు ... పట్టణ - నగర ఉద్యోగాలు, ఆవాసాలు, ఆ ఆవేశాలు, ఆటుపోట్ల మధ్య నిలబడి నెగ్గుకుని వచ్చిన వారము. ఒక విషయం అవగతమయింది. సంపాదన అనివార్యం ... ఏ రూపేణా అనునది మన స్వేచ్ఛ, పరిజ్ఞానం, ఆసక్తి, నైపుణ్యం, నేర్పరితనం ఇత్యాది విషయాల మీద ఆధారితం. ఒకరికి తృప్తిగా రుచికరమైన భోజనం అందివ్వడమే లక్ష్యంగా మేము శక్తియుక్తులను కూడగట్టుకుని ఆహారప్రియులకు రుచులు పంచుదామన్న ఒకే ఒక్క ఆశయంతో రంగ ప్రవేశం చేసాము. మా ఈ ప్రయత్నం మీకు జిహ్వానందంతో బాటు ... మాకు ఆర్ధిక బలం, స్వావలంబన చేకూర్చాలని ... తద్వార మరింత విస్తృతంగా సేవలు అందించే భాగ్యాన్ని ప్రసాదించాలని మనస్పూర్తిగా ఆశిస్తూ ... మీ సహకారాన్ని ఆకాంక్షిస్తూ ... మా తల్లి తండ్రుల ఆశీర్వాద సహితంగా ఈ పయనం మొదలు పెడుతున్నాము. ధన్యవాదములు.

Popular Business in hyderabad By 5ndspot

© 2024 FindSpot. All rights reserved.